కాటమరాయుడు రివ్యూ !


పవన్‌కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణానికి మరికొద్ది గంటలే సమయముంది. మార్చి 24 శుక్రవారం నాడు థియేటర్లలో కాటమరాయుడు సినిమా సందడి చేయనుంది. ఓవర్సీస్‌లో అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్ షో ల ద్వారా విడుదల కానుంది. అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ వీరమ్ రీమేక్‌గా వస్తున్న పవన్ ‘కాటమరాయుడు’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా ట్రైలర్, పాటలు, పోస్టర్స్.. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పవన్ ఫ్యాన్స్‌కు ఓ రోజు ముందుగానే సెన్సార్ బోర్డ్ సభ్యుడొకరు శుభవార్త చెప్పారు. యూకే, యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమా మేగజైన్ యూకే అండ్ యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంధూ.. కాటమరాయుడు గురించి తన ట్విటర్లో రివ్యూ పోస్ట్ చేశారు. 

కాటమరాయుడు గురించి మొట్టమొదటి రివ్యూ ఇదేనని చెబుతూనే సినిమా బ్లాక్‌బస్టర్ అని తేల్చేశారు. సినిమా రివ్యూను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన... పవన్ కల్యాణ్, శృతిహసన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందన్నారు. సాంగ్స్ బాగున్నాయనీ, ఫైట్ స్టంట్స్ అదుర్స్ అని అభిప్రాయపడ్డారు. పైసా వసూల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తేల్చిచెప్పారు ఉమైర్ సంధూ. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరిస్తుందన్నారు. డైలాగ్స్ బాగున్నాయన్నారు. స్టోరీ ఏమీ కొత్తది కాకపోయినా.. చూసే వారికి ఆ అనుమానమే కలగకుండా స్క్రీన్‌ప్లే ద్వారా దర్శకుడు మెస్మరైజ్ చేశారన్నారు. మొత్తంగా ఈ సినిమాకు ఆయన 4/5 రేటింగ్‌ను ఇచ్చేసి పవన్ ఫ్యాన్స్‌కు ముందే శుభవార్త చెప్పారు. 

Comments